పులివెందులలో జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళి 

 వైయ‌స్ఆర్ జిల్లా : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పులివెందులలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు జాతిపితకు ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని గాంధీ విగ్రహానికి వైయ‌స్ఆర్‌సీపీ పులివెందుల మున్సిపల్‌ ఇన్‌చార్జీలు వైయ‌స్‌ మనోహర్‌రెడ్డి, చవ్వా దుష్యంత్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశ స్వాతంత్య్రం కోసం సాగించిన పోరాటాన్ని, అహింసా మార్గంలో ఆయన చూపిన బాటను స్మరించుకున్నారు. దేశ ప్రజలకు గాంధీజీ అందించిన సేవలు, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు.

Back to Top