తాడేపల్లిగూడెంలో కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ 

తాడేపల్లిగూడెం: పట్టణంలోని 28 వార్డులకు చెందిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ గుర్తింపు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త వడ్డీ రఘురామ్‌ నాయుడు చేతుల మీదుగా కార్యకర్తలకు ఐడీ కార్డులను అందజేశారు.

పార్టీ పట్ల కార్యకర్తల నిబద్ధతకు గుర్తింపుగా, నాయకత్వ స్ఫూర్తిని పెంపొందించేందుకు ఐడీ కార్డులను అందజేస్తున్నట్లు నాయకులు తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్తకు పార్టీ పరంగా గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో టౌన్‌ ఇన్‌చార్జులు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఎంపీపీలు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Back to Top