యర్రగొండపాలెం: నియోజకవర్గంలో ఇటీవల జరిగిన స్కూల్ చైర్మన్ ఎన్నికల్లో విజయం సాధించిన వైయస్ఆర్‌సీపీ మద్దతుదారులను యర్రగొండపాలెంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.