పిలిచినా చర్చలకు రాకపోవడం కరెక్ట్‌ కాదు

చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సచివాలయం: ప్రభుత్వం పిలిచినా ఉద్యోగులు చర్చలకు రాకపోవడం కరెక్ట్‌ కాదని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వం పిలుపు మేరకు కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు వచ్చి వారు అనుకుంటున్న సమస్యల గురించి ప్రస్తావించారని చెప్పారు. సచివాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల్లో లేనిపోని అపోహలు రాకముందే సమస్యకు పరిష్కారం కూడా అన్వేషించవచ్చని ఉద్దేశంతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. గుడ్‌స్టార్ట్‌ జరగాల్సింది మూడు రోజులు ఆలస్యమైందన్నారు. ఈరోజు వచ్చిన కొన్ని సంఘాల ప్రతినిధులు కొన్ని సమస్యలను చెప్పారని, వాటిని నోట్‌ చేసుకున్నాం. చర్చిస్తామని చెప్పామన్నారు. మిగిలిన వారిని కూడా రమ్మని కోరుతున్నామని, సమస్య ఏదైనా ఉంటే కూర్చొని చర్చిస్తే పరిష్కారం అవుతుందని పదే పదే చెబుతున్నామని సజ్జల అన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top