చంద్ర‌బాబు అజ్ఞాతంలో ఏం కుట్రలకు తెరలేపుతున్నారో!

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

రాష్ట్రంలోకి సీబీఐని రావ‌ద్ద‌న్న బాబు..ఇప్పుడు ప్రతి ఘటనకు విచారణ కోరుతున్నారు 

రిజర్వాయిర్ లు నిండటంతో తండ్రీ కొడుకులు ఓర్వలేక పోతున్నారు

మా  ప్రభుత్వం శత్రువులకు కూడా అన్యాయం చేయదు

తాడేపల్లి : సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ఆధారాల‌తో సుప్రీం కోర్ట్ సీజేఐ కి లేఖ రాసినప్పటి నుంచి చంద్ర‌బాబు ఆజ్ఞాతంలోకి వెళ్ళార‌ని, అజ్ఞాతంలో ఉంటూ ఏ కుట్రలకు తెర లేపుతున్నారో అని వైయ‌స్ఆర్‌‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డిఅనుమానం ఉంది. అమరావతి అవినీతిపై విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని  పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలో మీడియా సమావుశంలో మాట్లాడుతూ.. ' రాష్ట్రంలోకి సీబీఐను అనుమతించను అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రతి ఘటనకు సీబీఐ విచారణకు ఎందుకని డిమాండ్‌ చేస్తున్నారు. తప్పు చేయకుంటే విచారణకు రావడానికి భయమెందుకు?  వేల కోట్ల అవినీతి చేసి ఇప్పుడు మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు విచారణకు భయపడుతున్నారూ అంటే దొంగలేవరో  ఇక్కడే తేలిపోతుంది. ప్రభుత్వంపై ఎలా బురద జల్లాలి అనే దానిపైనే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాక రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి.రైతుల కళ్లలో ఆనందాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు.  

రాష్ట్రంలో రిజర్వాయిర్ లు నిండటంతో తండ్రీ కొడుకులు ఓర్వలేక పోతున్నారు. వరదలపై చంద్రబాబు నిన్న మాట్లాడారు. ఆయన సీఎం అయ్యి ఉంటే గంట గంటకు టెలీకాన్ఫరెన్స్ చేసే వాడిని అంటూ మళ్లీ పాత పాటే పడుతున్నారు. వర్షాల వల్ల పంట నష్టం జరిగిన మాటమే నిజమే కానీ వారికి ఏ రకంగా సాయం చేయాలనేది ప్రభుత్వం చూసుకుంటుంది. బాబు గారు తన ఇల్లు ముంచేస్తున్నారని అంటున్నారు.కరెంట్ ప్లగ్ లో చెయ్యి పెట్టి షాక్ కొట్టకుండా ఉంటుందా..? ఒక రిజర్వాయిర్ లో అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటూ నువ్వే తప్పులు చేస్తూ నా కొంప ముంచుతున్నారని అనడం హాస్యాస్పదంగా ఉంది.

కరకట్టపై అక్రమంగా నివాసం ఉంటూ ఇల్లు మునిగిందంటే ఎలా? ఎవరి ఇల్లు ముంచాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. 9లక్షల క్యూసెక్కుల వరద రావడం వల్లే పలు ప్రాంతాలు నీట మునిగాయి. అమరావతిని ముంచాలనే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం శత్రువులకు కూడా అన్యాయం చేయదు. లోకేష్ పొలాల్లోకి దిగి ఫొటోలో దిగారు.. కనీసం వరి నాట్లు ఎలా ఉంటాయో కూడా తెలియని ఆయన  ఫోటోల కోసమే ఫోజులు ఇవ్వడం చేశారు. చంద్రబాబు హయాంలో కరువు వస్తే కనీసం ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వలేదు.కానీ అప్పటి బకాయిలను కూడా మా ప్రభుత్వం ఇచ్చింది. 

నిన్న విజయవాడలో జరిగిన సాయి తేజస్విని సంఘటనే కాదు.. ఏ సంఘటన జరిగిన ఈ ప్రభుత్వం సహించదు. పక్క రాష్ట్రంలో సంఘటన జరిగితే మన రాష్ట్రంలో దిశ చట్టం తెచ్చిన ఘనత వైయ‌స్ జగన్ ది. నితీశ్వరీ కేసులో దోషులను కాపాడి పంచాయతీ చేసిన ఘనత చంద్రబాబుదని' శ్రీకాంత్‌ రెడ్డి దుయ్యబట్టారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top