స‌మున్న‌త మార్పున‌కు సంకేతం... గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం 

 గార మండలంలో రెవెన్యూ శాఖా  మంత్రి వర్యులు ధర్మాన ప్రసాదరావు ప‌ర్య‌ట‌న

 గ్రామాల‌ను సంస్క‌రించే బాధ్య‌త అధికారుల‌దే...

 ల‌బ్ధిదారులతో భేటీ ..ప‌థ‌కాల వ‌ర్తింపుపై ఆరా ! 

 శ్రీ‌కాకుళం : స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరుకు సంబంధించి ప్ర‌తి ఒక్కరినీ క‌లిసేందుకు, వారి యోగ క్షేమాల‌తో పాటు ఇత‌ర ఆర్థిక ప్ర‌యోజ‌నాల విష‌య‌మై వివ‌రిచేందుకు ఉద్దేశించిన  గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకుని, మున్ముందుకు వెళ్లాల‌ని రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పిలుపునిచ్చారు.  గ్రామాల‌ను సంస్క‌రించే బాధ్య‌త అధికారుల‌దేనంటూ స్ప‌ష్టం చేశారు. గార మండ‌లం, నిజామాబాద్ గ్రామంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి ల‌బ్ధిదారులతో ముచ్చ‌టించారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి వారి యోగ క్షేమాలు క‌నుక్కొని, ప‌థ‌కాల‌ను వ‌ర్తింపు చేస్తున్న తీరును వివ‌రిస్తూ, వారికి వివిధ ప‌థ‌కాల కింద అందుతున్న ల‌బ్ధిని స‌వివ‌రంగా చెప్పి, ప్ర‌భుత్వం అందిస్తున్న ఆర్థిక ల‌బ్ధిని వినియోగించుకుని, స‌మాజంలో గౌర‌వంగా బ‌త‌కాల‌ని, అవినీతి,లంచ‌గొండి త‌నంకు ఆస్కారం లేని త‌మ ప్ర‌భుత్వాన్ని మ‌రోసారి దీవించాల‌ని కోరారు. అదేవిధంగా ప‌థ‌కాలు అందుకున్న వారంతా వీటి అమ‌లు వెనుక ఉన్న మంచి ఆలోచ‌న‌ను, సామాజిక దృక్ప‌థం మ‌రియు ప్ర‌యోజ‌నాన్ని గుర్తించాల‌ని విన్న‌వించారు.

అనంత‌రం ఇక్క‌డి గ్రామ స‌చివాలయంలో వివిధ శాఖల అధికారుల‌తో స‌మావేశం అయి ఇక్క‌డ ఉన్న స‌మ‌స్య‌ల‌ను స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు. విద్యుత్ ఏఈతో మాట్లాడారు. ఇక్క‌డ నెల‌కొన్న ట్రాన్స్ ఫారం స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాలి ఆదేశించారు. ముఖ్యంగా అధికారులు కానీ వ‌లంటీర్లు కానీ ప్ర‌జ‌ల‌తో ఇంట్రాక్ట్ అయ్యేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల‌ని కోరారు. కేవ‌లం ప‌థ‌కాల అమ‌లు తీరు గురించి మాట్లాడి ఊరుకుంటే కాద‌ని, మిగ‌తా వివ‌రాలు కూడా వారి నుంచి సేక‌రించాల‌ని, ముఖ్యంగా స్థానిక స‌మ‌స్య‌ల గుర్తింపు, ప‌రిష్కారం అన్న‌వి నిరంత‌రం జ‌రిగితేనే ప్ర‌భుత్వ ఆశ‌యం నెర‌వేరుతుంద‌ని అన్నారు. ప‌థ‌కాలు అందిన వారితో పాటు అంద‌ని వారితోనూ మాట్లాడి, వారు ఏ విధంగా ఎప్లై చేయాలి, ఎప్పుడు వారికి సంబంధిత ఆర్థిక ప్ర‌యోజ‌నం అందుతుంది అన్న‌వి వివ‌రించి రావాల‌ని స‌చివాల‌య సిబ్బందికీ, వలంటీర్ల‌కూ స్ప‌ష్ట‌మ‌యిన దిశానిర్దేశం చేశారు.

 "సంక్షేమ ప‌థ‌కాల ద్వారా అందుతున్న ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించి చాలా మందికి అవగాహన లేదు. అందుకే సచివాలయం పరిధిలో ఉన్న కుటుంబాలను ప‌ల‌క‌రించేందుకు గ‌డప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్దేశించి, నిర్వ‌హిస్తున్నాం. గడిచిన కాలంలో సంక్షేమ పథకాలు ఆదుకోవాలి అంటే పెత్తందారులు ఉండేవారు. మ‌ధ్య‌వ‌ర్తులు ఉండేవారు. ఇపుడు ఆ పరిస్థితి లేదు. ఇదీ అసలైన మార్పు అంటే.. ! బలహీనుడు, నిస్సహాయుడు దర్జాగా ఉన్నాడు. రాజ్యాంగ స్ఫూర్తి అమ‌లులో భాగంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను వ‌ర్తింప‌జేస్తున్నాం. కొన్ని స‌మ‌స్య‌లు ఈ రోజు దృష్టికి వచ్చాయి. గ్రామంలో ఎవ్వ‌రైనా అర్హ‌త ఉండి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే వారికి పథ‌కాల ద్వారా వ‌చ్చే ఆర్థిక ప్ర‌యోజ‌నం ఇచ్చి తీరాలి. ఇందులో భాగంగానే ప్ర‌తి ఆరు నెల‌ల‌కు ఒక‌సారి కొత్త‌వారిని ఎంపిక చేసి ప‌థ‌కాల‌ను వ‌ర్తింప‌జేస్తున్నాం. ఈ లెక్క‌న ఏడాదిలో రెండు సార్లు ప‌థ‌కాల అమ‌లుకు సంబంధించి జాబితా రూపుదిద్దుకునే ప్ర‌క్రియ అన్న‌ది ప్ర‌భుత్వ యంత్రాంగం చేస్తూ ఉంటుంది. పేద వారి కోసం అమలు చేస్తున్న ప‌థ‌కాల‌ను, సంబంధిత వ‌ర్గాలు వినియోగించుకుని, స‌మున్న‌త రీతిలో స‌మాజంలో త‌లెత్తుకునే విధంగా బ‌త‌కాలి. ఇదే ఆశయంతో  జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. గ్రామంలో మురుగు సమస్య నేటికీ ఉంది. వీలున్నంత వేగంగా ప‌రిష్క‌రించాలి. ప్రతి అధికారి తనకు ఇచ్చిన బాధ్యతలు సమర్థంగా నిర్వహించాలి.." అని రెవెన్యూ మంత్రి ధర్మాన అన్నారు.

కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, ఎంపిపి గోండు రఘురాం, వైస్ ఎంపిపి. బరాటం రామశేషు, నాటక అకాడమీ డైరెక్టర్ ముంజేటి కృష్ణ, సర్పంచ్ గంగు పద్మావతీ రామారావు,ఎంపిటిసి బైరి ప్రమీల, మండల ప్రత్యేక అధికారి రత్నాల వరప్రసాదరావు, ఎమ్మార్వో రామారావు, ఎంపిడివో రామ్మోహన్, డిప్యూటీ ఎమ్మార్వో ప్రసాద్, సచివాలయ సిబ్బంది, వైస్సార్సీపీ నాయకులు కొయ్యనా నాగభూషన్, యల్లా నారాయణ,  మార్పు పృథ్వి, రామారావు, దుర్గ ప్రసాద్, గోవింద్, అరవల రామారావు, తెలుకుటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top