డిజిటల్ లైబ్రరీలో అందరి పేర్లు డేటాతో సహా సేవ్ 

దాడులు వేసిన వారికి అసలు,  వడ్డీతో సహా  కలిపి ఇస్తాం

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ వార్నింగ్‌

 తాడేప‌ల్లి:  త్వ‌ర‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో డిజిటల్ లైబ్రరీ తెస్తున్నామ‌ని, అందరి పేర్లు డేటాతో సహా సేవ్ చేస్తున్నామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ పేర్కొన్నారు. మా పార్టీ శ్రేణుల‌పై దాడులు వేసిన వారికి అసలు,  వడ్డీతో సహా  కలిపి ఇస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. మంగళవారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయ‌స్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో పాల్గొన్న అనంతరం మార్గాని భ‌రత్ మీడియాతో మాట్లాడారు. ` వైయ‌స్‌ జగన్ పర్యటనలకు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు?. ప్రజాధరణ ఉన్న వ్యక్తికి భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. మేము అడ్డంకులు సృష్టిస్తే లోకేష్  పాదయాత్ర చేసేవారా? . వైయ‌స్ జగన్ భద్రతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. రోడ్డుపైకి చంద్రబాబు వెళ్తే ప్రజలు రావడం లేదు. అందుకే వైయ‌స్ జగన్ పర్యటనలపై కక్ష కట్టారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వైయ‌స్‌ జగన్  వెళ్తే మీ రూల్స్  ఏంటి.?.  మాజీ సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలకు రోప్ పార్టీ ఇవ్వడం లేదు. ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన రాజులు కాదు.. ఇది రాచరికం కాదని ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలి. రెడ్ బుక్  పేరుతో చేస్తున్న అరాచకాలను రాయడానికి ఏ బుక్ సరిపోవడం లేదు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై దాడులు చేసిన  ఎవరిని వదిలిపెట్టం. డిజిటల్ లైబ్రరీ తెస్తున్నాం అందరి పేర్లు డేటాతో సహా సేవ్ చేస్తున్నాం. దాడులు వేసిన వారికి అసలు,  వడ్డీతో సహా  కలిపి ఇస్తాం` అని మార్గాని భ‌ర‌త్ హెచ్చ‌రించారు.

Back to Top