రైతుల‌పై లాఠీచార్జ్ దారుణం

మాజీ ఎమ్మెల్యే వెంక‌టేష్‌గౌడు

చిత్తూరు:  త‌మ బాధ‌లు మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చెప్పుకునేందుకు బంగారుపాళ్యెం వ‌చ్చిన రైతుల‌పై పోలీసులు లాఠీచార్జ్ చేయ‌డం దారుణ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వెంక‌టేశ్‌గౌడు మండిప‌డ్డారు.  మాజీ సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు రాకుండా  రైతులను  పోలీసులు అడ్డుకుంటున్నార‌ని ఫైర్ అయ్యారు.  బంగారు పాల్యం మార్కెట్ యార్డును పోలీసు నిర్బంధంలోకి వెళ్లింద‌ని,  అటువైపు వస్తున్న వాహనాలు బయట ప్రాంతంలోనే నిలిపి వేస్తున్నార‌ని త‌ప్పుప‌ట్టారు. రైతులను, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిర్బంధించ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. ఇది  అప్రజాస్వామికం.. ఇంత దారుణంగా కక్ష్య సాధింపు చర్యల‌కు పాల్ప‌డ‌టం స‌రికాద‌ని, రైతులను వీడియోలు తీసి బెదిరించ‌డం దారుణ‌మ‌న్నారు.  

Back to Top