న‌కిలీ మ‌ద్యం దందాను అరిక‌ట్టాలి

మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీ‌ధ‌ర్‌రెడ్డి డిమాండ్‌

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా:  న‌కిలీ మ‌ద్యం దందాను అరిక‌ట్టాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీ‌ధ‌ర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి, ప్రజల ప్రాణాలను కాపాడాలని, ఈ కేసును సీబీఐ ద‌ర్యాప్తున‌కు అప్ప‌గించాల‌ని కోరుతూ బుధ‌వారం పుట్ట‌ప‌ర్తి ఎక్సైజ్‌కార్యాల‌యం ఎదుట వైయ‌స్ఆర్‌సీపీశ్రేణులు ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌ధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ..   భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నదియాడిన పుట్టపర్తి లో కూడా నకిలీ మద్యం దందా కొన‌సాగుతుంద‌ని మండిప‌డ్డారు.  బెల్ట్‌షాపులు ర‌ద్దుచేయాల‌ని ఈ సంద‌ర్భంగా ఎక్సైజ్ సూపరిండెంట్ గోవింద్ నాయక్ కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. 

Back to Top