చంద్రబాబుకు మతిభ్రమించింది

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీ‌నివాస్‌

విజ‌య‌వాడ‌:  చంద్ర‌బాబుకు మ‌తిభ్ర‌మించింద‌ని మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్ విమ‌ర్శించారు. చంద్రబాబు నుంచి బోండా ఉమా వరకూ కూటమికి ఓటమి భయం పట్టుకుంద‌న్నారు. బుధ‌వారం విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌వ‌ర్గంలో వెలంప‌ల్లి ఎన్నిక‌ల ప్రచారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

వెలంప‌ల్లి శ్రీ‌నివాస్ ఏమ‌న్నారంటే..

  • వాలంటీర్లు బస్తాలు మోస్తారన్నాడు
  • ఇంటికి వెళ్లి తలుపులు కొడతారన్నారు
  • మహిళలు మిస్సింగ్ అవుతున్నారన్నారు
  • ఇప్పుడు చంద్రబాబు మళ్లీ సానుభూతి చూపిస్తున్నాడు
  • శుంఠ పుత్రుడు లోకేష్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై నీచంగా మాట్లాడలేదా?
  • చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లకు సిగ్గు శరం లేదు
  • నిమ్మగడ్డ రమేష్‌తో కలిసి వాలంటీర్ వ్యవస్థపై దొంగ కేసులు బనాయించారు
  • వృద్ధుల ఉసురు పోసుకున్న దుర్మార్గులు చంద్రబాబు, పవన్, లోకేష్.
  • చంద్రబాబు మొన్న 50,000 అని ఈరోజు 10,000 అంటున్నాడు.
  • చంద్రబాబుకు మతిభ్రమించింది.
  • 2014లో చంద్రబాబు లోకేష్‌కి ఉద్యోగం ఇప్పించాడు.. అది మంత్రి ఉద్యోగం.
  • లోకేష్‌కి మంగళగిరిలో మళ్లీ ఓటమి తథ్యం
  • దత్తపుత్రుడు పవన్ పిఠాపురంలో ఓడిపోతాడు.
  • 175 నియోజకవర్గాల్లో గెలిచేది సీఎం జగనే
  • చంద్రబాబు, పవన్, లోకేష్, పురంధేశ్వరిని ప్రజలు ఓడించడం ఖాయం.
  • పవన్ ముఖ్యమంత్రి స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయికి.. రేపు కార్పొరేటర్ స్థాయికి వస్తాడు
  • టీడీపీ, జనసేన పార్టీలను ఎన్నికల తర్వాత బీజేపీలో విలీనం చేస్తారు
  • శవ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు
  • నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు చంద్రబాబు కేసీఆర్‌తో శవ రాజకీయాలు చేయలేదా?
  • చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కోలేదా?
  • సీఎం జగన్‌ కుటుంబంలో చిచ్చులు పెట్టి ఏదో ఒక విధంగా రాజకీయ లబ్ది పొందాలన్నది చంద్రబాబు ఆలోచన.
  • హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు
  • సీఎం జగన్ దుర్మార్గులపై అర్జునుడిలా పోరాటం చేస్తున్నారు.
Back to Top