మంత్రి సవిత వైఖరితోనే ప్రీకాట్ మిల్ మూత‌

మాజీ మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ ఫైర్‌

శ్రీ స‌త్య‌సాయి జిల్లా:  దశాబ్దాలుగా  ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న పరిగి మండలం గొర్రెపల్లి ప్రీకాట్ సూపర్ స్పిన్నింగ్ మిల్లు  మంత్రి సవిత నిర్లక్ష్యంతో మూడ‌ప‌డింద‌ని శ్రీ స‌త్య‌సాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు , మాజీ మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ మండిప‌డ్డారు. శ‌నివారం గొర్రెప‌ల్లి ప్రీకాట్ సూప‌ర్ స్పిన్నింగ్ మిల్లు వ‌ద్ద కార్మికుల‌తో క‌లిసి ఉషాశ్రీ చ‌ర‌ణ్ ధ‌ర్నా చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ..చేనేత, జౌలి శాఖ మంత్రి స‌విత  పెనుకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రాంతం అభివృద్ధిపై తీవ్ర నిర్లక్ష్య వైఖరి అనుస‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు.  ఎన్నో ఏళ్లుగా వంద‌లాది మంది కార్మికుల‌కు ఉపాధి క‌ల్పించిన  గొర్రెపల్లి ప్రీకాట్ సూపర్ స్పిన్నింగ్ మిల్లు మంత్రి సవిత నిర్లక్ష్యం వల్ల  ఇతర రాష్ట్రాలకు తరలి వెళుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మిల్ మూత‌ప‌డ‌టంతో స్థానికంగా ఉపాధి లేక  వందలాది కార్మిక కుటుంబాలు రోడ్డున‌ప‌డ్డాయ‌న్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక పరిశ్రమలు తరలి వెళ్తుంటే, పట్టించుకునే నాధుడే లేడని ధ్వ‌జ‌మెత్తారు. మిల్లు కార్మికుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ అండ‌గా ఉంటుంద‌ని ఆమె భ‌రోసా క‌ల్పించారు.   

Back to Top