అల్లూరి పోరాటం నేటి యువ‌త‌కు ఆద‌ర్శం

సీతారామ‌రాజు 128వ జ‌యంతి ఉత్స‌వాల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా

చిత్తూరు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ, ఆత్మస్థైర్యం నేటి యువతకు ఆదర్శమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. అల్లూరి సీతారామరాజు  128వ జయంతి వేడుక‌లు చిత్తూరు జిల్లా విజయపురం మండల కేంద్రంలో శుక్ర‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు. అల్లూరి విగ్రహానికి ఆర్కే రోజా పూల‌మాల వేసి, అక్క‌డే కేక్ క‌ట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మ‌గౌర‌వాన్ని ప్ర‌పంచానికి తెలియజేసిన మహానీయుడు అల్లూరి సీతారామ‌రాజు అన్నారు.  27 ఏళ్ల వ‌య‌సులోనే త‌న పోరాటం ద్వారా చిరస్థాయిగా నిలిచిన ఇతిహాస పురుషుడు అని కొనియాడారు. అల్లూరి త్యాగాన్ని భావితరాలకు గుర్తుగా నిలుపాలనే లక్ష్యంతో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పాల‌న‌లో ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టార‌ని గుర్తు చేశారు. పాడేరు వ‌ద్ద 22 ఎకరాల్లో అల్లూరి మ్యూజియాన్ని  నిర్మిస్తున్న ఘనత వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌ని ఆమె చెప్పారు.  

Back to Top