విజయవాడ: ఆదాయపన్నుశాఖను మేనేజ్ చేయడానికి చంద్రబాబు బీజేపీ సంక నాకొచ్చు, మోడీ కాళ్లు పట్టుకోవచ్చు, అమిత్ షా ది ఇంకేదో నాకోచ్చు అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదని ఆయన నిలదీశారు. సోమవారం కొడాలినాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు.. 420, దొంగ చట్టాలను అడ్డం పెట్టుకొని, వ్యవస్థను అడ్డం పెట్టుకొని డబ్బుని ఎలా దోచుకోవాలో? ఎలా దాచుకోవాలో తెలిసిన వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబుకి సింగపూర్ లో హోటల్స్ ఎలా వచ్చాయి..? ఎన్నికలకు రూ.5 వేల కోట్లు ఎలా ఖర్చు పెడతానని అంటాడు..? అంటూ ప్రశ్నించిన ఆయన.. చంద్రబాబు అవినీతిపరుడు కాదంటూ ఎక్కడా క్లీన్ చీట్ లేదన్నారు. చంద్రబాబు 2 ఏకరాలతో ఇప్పటివరకి బ్రతికాడా? అంటూ నిలదీశారు కొడాలి నాని.. 2014లో ఓడిపోయినా.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి 2019లో సింగిల్ గానే ఎన్నికలకు వెళ్లాడు.. కానీ, కొత్త పొత్తులు పెట్టుకోలేదన్న ఆయన.. బీజేపీని వాటేసుకుంటాడు, కాంగ్రెస్ పార్టీతో కలుస్తానంటాడు. ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. వైయస్ రాజశేఖర్ రెడ్డికి గానీ, వైయస్ రాజారెడ్డికి గానీ కొత్తగా డబ్బులు వచ్చాయా? ఏమైనా తిరుపతి బస్టాప్ లో కర్జూర కాయలు ఏమైనా అమ్మడా..? అని పంచ్‌లు వేశారు. అయితే, ఆదాయపన్నుశాఖను మేనేజ్ చేయడానికి బీజేపీ సంక నాకొచ్చు, మోడీ కాళ్లు పట్టుకోవచ్చు, అమిత్ షా ది ఇంకేదో నాకోచ్చు.. ఎన్ని చేసినా ఈ రాష్ట్ర ప్రజల నుంచి తప్పించుకోలేడు అంటూ కొడాలి నాని హెచ్చరించారు.