విశాఖ: ఈనెల తొమ్మిదిన వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్(YS Jagan) విశాఖ పర్యటనను ఆంక్షల పేరుతో పోలీసులు అడ్డుకోవడం సరికాదని అనకాపల్లి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైయస్ జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులకు రూట్‌మ్యాప్ ఇచ్చామని ఆయన తెలిపారు. అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..`వైయస్ జగన్ పర్యటనను ఎంత అడ్డుకుంటే అంత ఎక్కువ మంది జనాలు వస్తారు. ప్రతి చిన్న విషయానికి అనుమతులు కావాలంటున్నారు. అన్ని అనుమతులకు దరఖాస్తు చేశాం, పోలీసులు సహకరిస్తే మేము వాళ్లకి సహకరిస్తాం. లేదంటే వైయస్ జగన్ పర్యటన ఉప్పెనెల సాగుతుంది. ఎంతమంది ప్రజలు వస్తారు ఎన్ని కార్లు వస్తాయి వంటి అంశాలు ముందుగానే చెప్పమంటున్నారు. దేశం మొత్తం మీద వైయస్ జగన్ ఒక మాస్ లీడర్..వైయస్ జగన్ పర్యటనకు వచ్చే ప్రజలు గురించి లెక్క ముందే చెప్పమంటే ఎలా అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.