సంప‌ద సృష్టించ‌డం అంటే అప్పులు తెచ్చుకోవ‌డం అన్న‌మాట‌

కూట‌మి ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు సెటైర్లు

తాడేపల్లి: అమ‌రావ‌తికి అప్పు ఏర్పాటు చేస్తామ‌ని కేంద్రం ప్ర‌క‌టిస్తే దానికి గొప్ప‌లెందుక‌ని మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు కూట‌మి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. కేంద్ర బ‌డ్జెట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై ఆయ‌న స్పందించారు. ఈ మేర‌కు చంద్ర‌బాబును, తెలుగుదేశం పార్టీని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 

``అమరావతికి రూ.15,000 కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారు. సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట`` అని అంబ‌టి రాంబాబు సెటైర్లు వేశారు.
 

Back to Top