నిందితుల‌ను వ‌దిలి..ఫిర్యాదు చేసిన వారిపై త‌ప్పులు కేసులేంటి?

అబేంద్కర్‌ విగ్రహానికి నిప్పుపెట్టిన నిందితుల‌ను ప‌ట్టుకోండి

మాజీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి డిమాండ్‌

చిత్తూరు జిల్లా: గంగాధర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం దేవళంపేటలో అబేంద్కర్‌ విగ్రహానికి నిప్పుపెట్టిన నిందితుల‌ను వ‌దిలిపెట్టి..ఫిర్యాదు చేసిన ద‌ళిత సర్పంచ్‌పై త‌ప్పుడు కేసులు న‌మోదు చేయ‌డం ఏంట‌ని మాజీ డిప్యూటీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు నారాయ‌ణ‌స్వామి మండిప‌డ్డారు. అంబేద్క‌ర్ విగ్ర‌హానికి నిప్పుపెట్టిన అస‌లు నిందితుల‌ను ప‌ట్టుకోవాల‌ని ఆయ‌న డిమాండు చేశారు. సోమ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త కృపాల‌క్ష్మీతో క‌లిసి నారాయ‌ణ‌స్వామి మీడియాతో మాట్లాడుతూ..` దేవ‌ళంపేట‌లో రెండేళ్ల క్రితం వైయస్ఆర్‌సీపీ నేత, సర్పంచ్‌  గోవిందయ్య అంబేద్క‌ర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌ప‌డ‌గా అప్ప‌ట్లో టీడీపీ నేత సతీష్‌ నాయుడు అడ్డుకున్నారు. మా ప్ర‌భుత్వంలో అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌గా, కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక అక్టోబరు మూడో తేదీ రాత్రి అంబేద్కర్‌ విగ్రహానికి నిప్పు పెట్టారు. ఈ విష‌యంపై గ్రామ స‌ర్పంచ్ గోవింద‌య్య‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సతీష్‌నాయుడును అరెస్టు చేయాలంటూ పోలీసులను  గోవిందయ్య కోరాడు. అయితే నిందితుడిని అరెస్టు చేయ‌కుండా తిరిగి గోవిందయ్యపైనే పోలీసులు కేసు పెట్టి,  విచార‌ణ పేరుతో మూడురోజులపాటు  వేధిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం కాల్చడం దళితుల మనోభావాలను కాల్చడంతో సామానం.  నిప్పుపెట్టిన‌ నిందితులను వెంటనే పట్టుకోవాలి. ఫిర్యాదు చేసిన వ్యక్తినే మూడు రోజులుగా విచారణ పేరుతో నిర్బంధించడం మంచి పద్ధతి కాదు. దళితుడైన గోవిందయ్యను నిందితుడుగా చేర్చి అగ్రవర్ణాలకు చెందిన సతీష్ నాయుడు ను పక్కదారి పట్టించడం కూటమి ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్య. విగ్రహం పెట్టిన నాటి నుండే సతీష్ నాయుడు ఓర్వలేక ఎన్నో కుతంత్రాలు చేశారు. నాటి విగ్రహ నిర్మాణ శిలాఫలకాలను ధ్వంసం చేసి నేడు కాల్చిన రోజే శిలాఫలకాలు పెట్టడంపై దేనికి అర్థం. నిజాలను విచారించకుండానే కూటమి ఎమ్మెల్యేలు గోవిందయ్య నిందితుడు అనడం దేనికి సంకేతం. నిజా నిజాలను పోలీసులు బయట పెట్టాలి . అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చిన వారిని వెంటనే పట్టుకుని శిక్షించాలి` అని నారాయ‌ణ‌స్వామి డిమాండ్ చేశారు.  

Back to Top