అసెంబ్లీ ముందుకు ఏపీ మౌలిక బిల్లు

సభలో బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
 

అమరావతి: ఏపీ మౌలిక(న్యాయ సమీక్ష ద్వారా పారదర్శకత)బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం సర్వోన్నత లక్ష్యంగా పారదర్శకతతో వేగవంతమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి ఈ బిల్లు పాటుపడుతుంది. సమాన అవకాశం, వ్యయం, నాణ్యత, స్వగృహాల సూత్రాలను పాటిస్తూ ఒక సమర్ధవంతమైన రీతిలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం దృఢంగా నిశ్చయించింది. ప్రజాప్రయోజనంలో అనుకూలమైన వనరులను వినియోగించేందుకు వెనుకకు తిప్పివేసి అంటే రీవర్స్‌ టెండరింగ్‌ వంటి సమర్ధవంతమైన క్రమబద్ధతను ఉపయోగించేలా ఈ బిల్లు చూస్తోంది. 2001వ సంవత్సరంలో శాసనం చేయబడి, ఆయా సమయాల్లో సవరించబడిన ఏపీ మైలిక సదుపాయాల అభివృద్ధికి వీలు కలిగే విధంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో (పీపీపీ) మాత్రమే పరిమితమైంది. ఆ ప్రకారంగా అనుసరించాల్సిన ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఉంది.  సదరు ఉద్దేశాలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యావత్తు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు, ముఖ్యంగా రూ.100 కోట్లు మించిన ప్రాజెక్టుల పర్యవేక్షణకు ఒక సమగ్రమైన శాసనాన్ని తీసుకురావడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనిని ప్రారంభించేందుకు ఉన్నత న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తి కింద సమీక్ష నిర్వహించి వేగవంతమైన మౌలిక సదుపాయాల కోసం రూపురేఖలు పొందుతున్న అవసరాలు, ఆవశ్యకతకు తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు దీనిని ఆవశ్యకం చేయవచ్చు. ఆ ప్రకారంగా న్యాయపరమైన ముందస్తు సమీక్షకు ఒక యంత్రాగాన్ని ఏర్పాటు చేసేందుకు ఒక శాసనాన్ని తీసుకురావాలని నిర్ణయించాం. పై లక్ష్యాలను సాధించేందుకు ఈ బిల్లు రూపొందించామన్నారు. 
 

Back to Top