జగనన్న న్యాయం చేస్తారని మాట ఇస్తున్నా

రైతులతో వైయస్‌ షర్మిల ముఖాముఖి 
 

గుంటూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే అందరికీ న్యాయం చేస్తారని వైయస్‌ షర్మిల మాటిచ్చారు. రాజధాని ప్రాంతంలో భూములు కొల్పోయిన రైతులతో వైయస్‌ షర్మిల శుక్రవారం ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం కాదన్నారు.   చంద్రబాబు తాను ఏది కావాలంటే అది తీసుకోవచ్చు.. తనకు వ్యతిరేకంగా ఉన్న వారిపై కేసులు పెడతా అంటే అతడు ముఖ్యమంత్రి అనిపించుకోడు. చంద్రబాబును దుర్మార్గుడు అంటారు.  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మంచి మనిషి అనుకుంటే.. ఆయన కొడుకు కూడా మంచి వ్యక్తి కాడా? అన్నారు. ప్రజలకు సేవ చేయడం ముఖ్యం. నేను ప్రజలకు సేవ చేసేందుకే అధికారంలోకి వచ్చానని చెబితేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు.

ఈ మాట దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అనుకున్నారని, అందుకే ఆయన పాలనలో అందరికి మంచి జరిగిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజలకు సేవ చేయడమే మహాభాగ్యమనుకున్నారని అందుకనే రాష్ట్రం కళకళలాడిందని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు.  చంద్రబాబు మాదిరిగా అధికారం ఉందని ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అని, తనకు వ్యతిరేకంగా ఉన్న వారిపై కేసులు పెడతానంటే ఆయన్ను ముఖ్యమంత్రి అనరన్నారు. దుర్మార్గుడు అనిపించుకుంటారని చెప్పారు. అమ్మా..మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే..రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు మీ ముందు ఉన్నారని, చంద్రబాబు, వైయస్‌ జగన్‌ ఉన్నారని, ఈ ఇద్దరి వ్యక్తిత్వాలు చూడాలని షర్మిల కోరారు.  ఎవరు ఏం చేశారో చూడాలని విజ్ఞప్తి చేశారు. మంచివారిని ముఖ్యమంత్రిగా ఎంచుకోవాలని కోరారు. అధికారమే ముఖ్యమనుకుంటే వైయస్‌ జగన్‌ కూడా తప్పుడు వాగ్ధానాలు చేసేవారని గుర్తు చేశారు.

అధికారం ముఖ్యం కాదని, ప్రజలు, ప్రజల ప్రేమ ముఖ్యమన్నారు. ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని, మీ గుండెల్లో చోటు సంపాదించుకోవడమే మాకు ముఖ్యమన్నారు.  మీకు ఎప్పటికీ మా అన్న అన్యాయం చేయడని నేను మాటిస్తున్నాను. భూములు కోల్పొయిన వారికి రాజన్న బిడ్డగా చెబుతున్నాను..జగనన్న మీకు న్యాయం చేస్తారు. మేము మీ పక్షాన నిలబడతామని హామీ ఇచ్చారు.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏమేమి చేశారో అది అన్యాయమైతే..జగనన్న ముఖ్యమంత్రి కాగానే అన్ని పునర్‌పరిశీలించి ఎక్కడ మార్పులు అవసరమైతే అక్కడ మార్పులు చేస్తామని చెప్పారు.  ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రైతులకు తప్పకుండా మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పారు. మళ్లీ మోసపోకుండా  ఫ్యాన్‌ గుర్తు మీదా అందరూ ఓటు వేయాలని, ఈ ఒక్క మంచి పని చేస్తే  మన రాష్ట్రం మళ్లీ కళకళలాడుతుంది. రాష్ట్ర విభజనతో రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందని, మన భవిష్యత్తుకు, మన పిల్లల భవిష్యత్తుకు  ఇది మంచిది కాదన్నారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్‌కు మేలు చేసుకుంటున్నారు తప్ప ఆయనకు ఎవరూ కనిపించడం లేదని చెప్పారు.  ఈ ఒక్కటీ ఆలోచించాలని ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేస్తే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు. 

 
 

Back to Top