నెల్లూరు: నగరంలోని 54వ డివిజన్ పరిధిలో రామయ్య బడి, రాజాగారి వీధి, అలంకార్ సెంటర్ ప్రాంతాల్లో వైయస్ఆర్‌సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి, 54వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షబానా పర్వీన్‌తో కలిసి ప్రచారం, రోడ్‌షోలో పాల్గొన్నారు. నవంబర్ 1న జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు నగర కార్పొరేషన్‌లో ప్రజలకు అందాల్సిన సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, కొన్ని సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్ పాలనలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు పారదర్శకమైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి, కార్పొరేషన్ సేవలను మరింత సులభతరం చేస్తామని తెలిపారు. ప్రజలకు జవాబుదారీగా, నిస్వార్థంగా పనిచేసే పాలన కోసం ఆనం విజయకుమార్‌రెడ్డి, షబానా పర్వీన్‌లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.