ఎండియూ వాహనాల రద్దును ఉపసంహరించుకోవాలి 

మాజీ ఎంపీ వంగా గీతా

కాకినాడ‌:  ప్ర‌జ‌ల‌కు ఇంటి వ‌ద్దే రేష‌న్ స‌ర‌ఫ‌రా చేసే ఎండీయూ వాహ‌నాల ర‌ద్దు నిర్ణ‌యాన్ని కూట‌మి ప్ర‌భుత్వం వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కురాలు, మాజీ ఎంపీ వంగా గీతా డిమాండ్ చేశారు. ఎండియూ వాహనాలను కొనసాగించాలని కోరుతూ గొల్లప్రోలు లో ఆప‌రేట‌ర్లు చేప‌ట్టిన ఆందోళ‌న‌కు వంగా గీతా మ‌ద్ద‌తు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. `వైయ‌స్ జగన్ పై కోపంతో చంద్రబాబు పేద ప్రజల్ని యిబ్బంది పెడుతున్నారు. పేద, బడుగు వర్గాలపై చంద్రబాబు కక్షసాధిస్తున్నారు. పేదలకు చేరువుగా ఇంటింటికి రేషన్ అందించే వాహనాలను వైయ‌స్ జగన్ ప్రవేశపెట్టారు.పేదలకు దగ్గర ఉన్న ఎండియూ వాహనాలను నిర్వీర్యం చేయ్యడం కరెక్ట్ కాదు. విజయవాడ వరదల్లో ఎండియూ వాహనాల ద్వారా భాధితులకు సేవలందించారు.ఎండియూ వాహనాలపై ఆధారపడి 25 వేల మంది జీవిస్తున్నారు` అని వంగా గీతా తెలిపారు. అనంత‌రం కాకినాడ‌లో నిర్వ‌హించిన పార్టీ ముఖ్య నేత‌ల స‌మావేశంలో ఆమె పాల్గొన్నారు.
 

Back to Top