తాడేపల్లి: విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో, కష్ట సమయాల్లో ధైర్యంగా ఉంటూ విజయవంతంగా ఎలా అధిగమించాలో హనుమాన్ చరితమే ఒక ఉదాహరణ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. శక్తిమంతుడు, సమర్థుడైన కార్యసాధకుడు ఆంజనేయుడు. విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో, కష్ట సమయాల్లో ధైర్యంగా ఉంటూ విజయవంతంగా ఎలా అధిగమించాలో హనుమాన్ చరితమే ఒక ఉదాహరణ. శ్రీ రాముడి బంటు అయిన ఆంజనేయుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.