రోడ్డుప్రమాదంలో కొండా రాజీవ్‌కు గాయాలు

విశాఖ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి కొండా రాజీవ్ గాంధీకి రోడ్డు ప్ర‌మాదంలో గాయాల‌య్యాయి. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి విశాఖ నుంచి అరుణాచ‌లం వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా  తిరువన్నామలై వద్ద వారు ప్ర‌యాణిస్తున్న కారు రోడ్డు మ‌ధ్య‌లో డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. కారులోని బెలూన్స్ ఓపెన్ కావ‌డంతో ఘోర ప్ర‌మాదం త‌ప్పింది.  రాజీవ్‌తో పాటు కుటుంబ స‌భ్యుల‌కు గాయాల‌య్యాయి. వారిని స్థానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. 

కాగా, తమిళనాడు తిరువణ్ణామలై వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీని  పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్  సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్‌లో ప‌రామ‌ర్శించారు. 

Back to Top