వైయస్ఆర్‌సీపీ నాయకుల అక్రమ అరెస్టు తగదు 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్యుల విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ 
 

దాచేపల్లి :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయ‌కుల‌ను పోలీసులు అక్ర‌మంగా అరెస్టు చేయ‌డం త‌గ‌ద‌ని  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్యుల విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు.వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడు ఉప్పుతోళ్ల ఎల్లయ్య కుమారుడు హరికృష్ణ ను ఈరోజు తెల్లవారుజామున దాచేపల్లి సిఐ భాస్కరరావు అక్రమంగా అరెస్టు చేయ‌డం ప‌ట్ల ఆయ‌న తీవ్రంగా ఖండించారు.  దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి హరికృష్ణను ఎందుకు అరెస్ట్ చేశారని  ప్రశ్నించారు. అధికార పార్టీ నేత‌లు చెప్పార‌ని అన్యాయంగా, అక్రమంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల‌ను అరెస్ట్ చేయ‌డం స‌రికాద‌న్నారు. పోలీస్ స్టేషన్లో అమాయ‌కుల‌ను చితక బాదితే  తగిన మూల్యం భవిష్యత్తులో చెల్లించుకోవాల్సి వస్తుందని  డాక్టర్ అశోక్ కుమార్ హెచ్చ‌రించారు.  

Back to Top