కాసేపట్లో వైయ‌స్‌ జగన్‌ ప్రెస్‌మీట్ 

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రస్తుత పరిస్థితులపై మీడియాతో(Jagan Press Meet) మాట్లాడతారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.ఎన్నికల వేళ  ‘సూపర్‌ సిక్స్‌’ మేనిఫెస్టో పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విస్మరించింది. ఈ ఘరానా మోసాన్ని ఎండగట్టడంతో పాటు కీలక రాజకీయాంశాలపై మీడియా స‌మావేశంలో మాట్లాడే అవ‌కాశం ఉంది.

Back to Top