చంద్రబాబు ఏది చెబితే అది చేయడానికి కోటం రెడ్డి సిద్ధం

మాజీ మంత్రి పేర్ని నాని

ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు

వెళ్లిపోవడానికి నిర్ణయించకుని ప్రభుత్వంపై బురద వేస్తున్నావా?

జగన్ పార్టీ పెట్టకపోతే ఇంత మంది ఎమ్మెల్యేలు అయ్యేవారా?

నేను మంత్రిని అయ్యేవాడినా?

విజ‌య‌వాడ‌:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఏం చెబితే అది చేయ‌డానికి నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి సిద్ధంగా ఉన్నార‌ని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్ర‌భుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని  ఆయ‌న కొట్టిపారేశారు.బుధ‌వారం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..ఫోన్ ట్యాపింగ్ లు చేయడమే ప్రభుత్వ పనా? అని ప్రశ్నించారు.. మూడు నెలల నుంచి జరుగుతుంటే ఇప్పుడు ఎందుకు చెప్పారు? అని నిలదీశారు.. స్మార్ట్ ఫోన్లలో రికార్డింగ్ ఆప్షన్ కామన్ గా జరుగుతుంది.. కానీ, ఇలా, ముఖ్యమంత్రి గురించి ఎబ్బెట్టుగా మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ లు ప్రచారంలో ఉంటే అధికారులు అలెర్ట్ చేసి ఉంటారన్నారు.. బురద వేయటానికి ఏమైనా మాట్లాడవచ్చు.. ప్రజల్లో సానుభూతి కోసమే ఈ ఆరోపణలు అంటూ కొట్టిపారేశారు పేర్ని నాని.

  చంద్రబాబే ట్యాపింగ్ సామాన్లు కొనలేదని చెప్పాడు.. మేం కూడా కొనలేదని పేర్ని నాని అన్నారు.  ఫోన్ ట్యాపింగ్ చేసే సదుపాయం ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. మంత్రి పదవి ఇవ్వకపోతే వెళ్లిపోతామంటూ ఎలా? అని ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్.. నమ్మి టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్యేలం అయి ఉండేవాళ్ళమా? అని ఫైర్‌ అయ్యారు.. నిజంగా పార్టీ నాయకుడిపై ప్రేమ, భక్తి ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తే వెళ్ళి పోతారా? అని నిలదీశారు.. అసలు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిది అవకాశవాద రాజకీయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకటి వ్యవహారాలు ఉన్నాయా? ట్యాపింగ్ కి భయపడటానికి.. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన కాటసాని రాంభూపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదు.. ఆయన ఎంత ఓపికతో ఉన్నారు.. వాళ్ళు తోపులు కాదా? అంటూ మండిపడ్డారు.. కోర్టులో ఉన్న విషయాలను ఈ పోటుగాళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదా? అని మండిప‌డ్డారు.

Back to Top