గుడివాడ‌లో అభివృద్ధిని అడ్డుకోవ‌ద్దు

 ఎమ్మెల్యే కొడాలి నాని 
 

విజ‌య‌వాడ‌:  గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో పురందేశ్వరి  అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. అన్న ఎన్టీఆర్ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఎంపీ వల్లభనేని బాలశౌరిల కృషితో గుడివాడ ప్రజల సుదీర్ఘ సమస్య అయినా  రైల్వే గేట్లపై ఫ్లైఓవర్లు మంజూరు అయ్యాయని తెలిపారు. కేవలం పది మంది వ్యాపారుల ప్రయోజనాల కోసం లక్షలాది మంది కి ఉపయోగపడే రైల్వే బ్రిడ్జిల నిర్మాణాన్ని అడ్డుకోవడం దారుణమని, ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. రైల్వే బ్రిడ్జి నిర్మాణం ఆగిపోతే గుడివాడ మీదుగా వెళ్లే రైళ్ళను  అడ్డుకుంటామన్న పురందేశ్వరి ప్రయత్నాలు మానుకోవాలని ఎమ్మెల్యే నాని హితవు పలికారు.  

Back to Top