ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

నేటి  నుంచి  25 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ

నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు మార్చి 28

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా జిల్లాల వారీగా కూడా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. నోటిఫికేషన్ ప్రక్రియతో రాష్ట్రంలోని  25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి  ఈనెల  25 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు మార్చి 28,  ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరుగుతుంది. 

Back to Top