తాడేపల్లి: మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్తీక వనసమారాధనలో కులాన్ని అడ్డు పెట్టుకుని వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గుచేటు అని తూర్పు గోదావరి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. శెట్టిబలిజ, గౌడ ఉప కులాలను ఒకే గొడుగు కిందకు చేరుస్తూ 1997లో చంద్రబాబు హాయంలోనే జీఓ నెం:16 విడుదల కాగా.. దానిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో గతంలో ఏ ప్రభుత్వాలు దాన్ని అమలు చేయలేదని తెలిపారు. మరలా 2025 జూలై 30 నుంచి తిరిగి కూటమి ప్రభుత్వ హయాంలోనే దాన్ని అమలు చేస్తుంటే.. మంత్రి వాసంశెట్టి సుభాష్, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఆ ప్రతిపాదన వచ్చిందనడం అవగాహనా రాహిత్యమని ఆయన మండిపడ్డారు. శెట్టిబలిజల మనోభావాలను నాడూ నేడూ చంద్రబాబునాయుడే దెబ్బతీశారని స్పష్టం చేశారు. అయినా దాన్ని కప్పి పుచ్చి మంత్రి సుభాష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... వనసమారాధనలో వ్యక్తిగత విమర్శలు... అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 16వ తేదీన శెట్టిబలిజ సంఘం వనసమారాధన జరిగింది. పార్టీలకతీతతంగా ఈ కార్యక్రమాన్ని వైయస్ఆర్‌సీపీనాయకుడు కుడిపూడి సూర్యనారాయణ రావు అధ్యక్షత కార్యక్రమం జరపాలని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర కేబినెట్ మంత్రి సుభాష్ సత్యదూరమైన కామెంట్స్ చేయడం బాధాకరం. తనను తాను శెట్టిబలిజ కులానికి నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటూనే.. నాపైనా, వైయస్.జగన్ పైనా విమర్శలు చేయడం సరికాదు. వైయస్ జగన్ వల్ల లబ్ధి పొందిన వ్యక్తి ఈ రకంగా మాట్లాడ్డం బాధాకరం. శెట్టిబలిజ యువత నీ అబద్ధాలతో నష్టపోయే ప్రమాదం ఉంది. శెట్టిబలిజ కులానికి గౌడ చేర్చి సర్టిఫికేట్లు ఇచ్చారని మంత్రి సత్యదూరమైన మాటలు మాట్లాడారు. 1997లో నాటి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు సీఎంగా ఉండగా జీవో నెం:16 జారీ చేశారు. ఆ రోజు గౌత లచ్చన్నగారు గీత కులం, ఉప కులాలు కలిసి ఒక గొడుగు కిందకు రావాలని ఉద్దేశంతో అడిగారు. అప్పటి నుంచి ఈ ఏడాది జూలై 30 వరకు ఈ సర్టిఫికేట్ ఎవరికీ జారీ చేయలేదు. అప్పటి నుంచే గౌడ అని రాస్తూ బ్రాకెట్‌లో శెట్టిబలిజ అని ప్రస్తావిస్తూ «ధృవీకరణ పత్రాలు జారీ చేయడం మొదలైంది. దీంతో శెట్టిబలిజ సామాజివక వర్గంలో ఆందోళన నెలకొంది. దీంతో మంత్రి సుభాష్ ఇది సాంకేతిక సమస్య అని ఒకసారి... తాను సాంఘిక సంక్షేమ మంత్రితో మాట్లాడి పరిష్కారిస్తానని మరోసారి చెప్పాడు. మరో రోజు తర్వాత ఈ నెపాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై నెట్టే ప్రయత్నం చేశాడు. వైయస్ఆర్‌సీపీ హయాంలో వచ్చిన జీవో మేరకే ఈ రకంగా జారీ చేస్తున్నారన్నాడు. ఇవన్నీ నిజాలు కాదు. ఈ రకంగా అవగాహన లేకుండానో.. లేక రాజకీయ లబ్ధి కోసమే కులాన్ని వాడుకోవాలని చూస్తున్నాడు. అప్పుడు, ఇప్పుడూ మనోభావాలు దెబ్బతీసింది చంద్రబాబే.. చంద్రబాబు ప్రభుత్వమే 1997లో జీవో ఇచ్చింది. కేబినెట్ మంత్రికి హుందాతనం ఉండాలి. కానీ ఆ సభలో మీరు మాట్లాడిన భాష, మీరు వ్యవహరించిన తీవ్ర అభ్యంతరకరం. కులం నీకు మాత్రమే పరిమితం కాదు. గతంలో నా సమక్షంలోనే నువ్వు చేసిన తప్పులు ఒప్పుకున్న సంగతి మర్చిపోయావా? మంత్రి అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా? కులాన్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడిన నీ మాటలను కచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. శెట్టిబలిజ సామాజికవర్గంలో యువతను తప్పుదోవ పట్టించవద్దు. సంఘాలు నడిపే పెద్దలు..దీన్ని సీరియస్ గా తీసుకుని మంత్రితో మాట్లాడి అసలు నిజాలు చెప్పించాలి. మంత్రిగారి వల్లనే సమస్య: ప్రజలు మీ మాటలు వింటున్నారు. మీ ప్రవర్తన మార్చుకోవాలి, భాష నేర్చుకోవాలి. శెట్టిబలిజ కులం ఇప్పటికే ఓబీసీ స్టేటస్‌లో 93లో చేర్చబడింది. దేశవ్యాప్తంగా బీసీ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని చెబుతున్న మంత్రి.. తెలంగాణాలో ఇప్పించాలి. అది రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్టు. తెలంగాణాలో శెట్టిబలిజ కులాన్ని బీసీ జాబితా నుంచి తొలగించిందెవరో చర్చకు సిద్దమా? దానికి కారణం ఎవరో, ఎవరి నిర్ణయం వల్ల శెట్టిబలిజలకు అన్యాయం జరిగిందో చర్చిద్దామా?. మరలా నువ్వు హైదరాబాద్ లో నాటకానికి తెరతీస్తూ.... 16 జీవో అమలు చేయాలంటావు. అందులో ఏముందో తెలుసుకునే జ్ఞానం లేకుండా.... మాట్లాడుతున్నావు. మీ నాయకులు వస్తే మాట్లాడ్డానికి నేను సిద్దం? జనాలు వింటున్నారని నీకు ఇష్టం వచ్చినట్లు మాడ్లాడవద్దు. సోషల్ మీడియా చేతిలో ఉందని నీకు ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నావు. కేబినెట్ మంత్రిగా ఉన్న నీ భాష గురించి అందరూ చర్చించుకుంటున్నారన్న విషయం మర్చిపోవద్దు. బయట వ్యక్తులు మొత్తం సామాజికవర్గాన్ని చులకన చేసేలా ఉన్న నీ బాష ఉంది. అసలు శెట్టిబలిజ కులానికి సమస్యే నీ వల్ల వచ్చిందని మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చురకలంటించారు.