గిరిజ‌న సంక్షేమానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పెద్ద‌పీట‌

 డిప్యూటీ సీఎం పుష్పాశ్రీ‌వాణి

కొండ‌ప‌ల్లిలో గిరిజ‌న గురుకుల పాఠ‌శాల ప్రారంభం

విజ‌య‌వాడ‌:  గిరిజ‌నుల సంక్షేమానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పెద్ద‌పీట వేశార‌ని డిప్యూటీ సీఎం పుష్పాశ్రీ‌వాణి పేర్కొన్నారు. బుధ‌వారం కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో ని కొండపల్లి గ్రామంలో గిరిజన గురుకుల (బాలికల)పాఠశాల నూతన తరగతి గదులను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల సొసైటీ, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ తదితర 27 స్కూల్‌ భవనాలను ఇప్ప‌టికే ప్రారంభించామ‌న్నారు. అధునాతన సౌకర్యాలు గల వీటిని రూ.44 కోట్లతో నిర్మించామ‌న్నారు. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలల్లో రూ.16 కోట్లతో ఆర్వో ప్లాంట్ల నిర్మాణాలు చేప‌ట్టిన‌ట్లు చెప్పారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top