సీఎం వైయస్‌ జగన్‌ సరే అంటే టీడీపీ నుంచి 16 మంది ఎమ్మెల్యేలు రెడీ

డిప్యూటీ సీఎం నారాయణస్వామి

వైయస్‌ఆర్‌ కంటి వెలుగు రెండో విడత ప్రారంభం

చిత్తూరు: రాష్ట్రంలో టీడీపీ జీరో అయిందని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి సరే అంటే టీడీపీ నుంచి 16 మంది ఎమ్మెల్యేలు వైయస్‌ఆర్‌సీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి  వెల్లడించారు. చంద్రబాబులాగా వైయస్‌ జగన్ ఎవరినీ కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.  దృష్టి లోపం నివారణ కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైయస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమం రెండో విడతను చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలను అందిస్తున్నామని పేర్కొన్నారు.  చంద్రబాబు కేసులకు భయపడి టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపారని ఆయన విమర్శించారు. టీడీపీని కూడా బీజేపీలో కలిపేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ ధైర్యం చాలడం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు కూడా బీజేపీలో చేరాలని తపిస్తున్నారని చెప్పారు.  

Read Also:  ప్రపంచం ఉన్నంత వరకు ఫోటోగ్రఫి ఉంటుంది

Back to Top