ప్రపంచం ఉన్నంత వరకు ఫోటోగ్రఫి ఉంటుంది

ఫోటోగ్రాఫర్, జర్నలిస్టుల అవార్డ్స్ వేడుకలో మంత్రి కన్నబాబు

అమరావతి: ప్రపంచం ఉన్నంత వరకు ఫోటోగ్రఫి ఉంటుందని వ్యవసాయ శాఖమంత్రి కన్నబాబు పేర్కొన్నారు. విజయవాడలోని కల్చరల్ ఆఫ్ సొసైటీలో ఫోటోగ్రాఫర్, జర్నలిస్టుల అవార్డ్స్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొని ఫోటో గ్రాఫర్లకు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ..  తానూ ఒక జర్నలిస్ట్ గా పని చేసి ఈ స్థాయికి వచ్చానని గుర్తుచేశారు. ఎక్కడి నుంచి వచ్చినా మన మూలాల్ని మర్చిపోకూడదని, రిపోర్టర్ కష్టం కన్నా ఫోటోగ్రాఫి చాలా కష్టమైన పని అని అన్నారు. మాజీ సీఎం ఎన్టీ రామారావు చనిపోయే సమయంలో తాను జర్నలిస్టుని, ఆ సమయం లో నా కళ్ళల్లో నీటిని ఫోటోలో బంధించారని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్స్ అందరితో కలిసి పని చేసిన తాను.. ఇప్పుడు అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఫోటోల సాక్ష్యం తోనే ఎన్నో కేసులు తీర్పులు ఇవ్వడం జరిగిందనా పేర్కొన్నారు. 

 

Read Also: 'ఇస్కో.. ఉస్కో' అనడమే పరువు తక్కువ పని

తాజా ఫోటోలు

Back to Top