ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు మే నెలాఖరుకు పూర్తి

డిప్యూటీ ముఖ్యమంత్రి ఆళ్లనాని
 

అసెంబ్లీ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలన్నింటిని 2020 మే నెలాఖరుకు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. తాడేపల్లిగూడెం ఏరియాని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దశల వారిగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఈ ఏడాది ఆ ఆసుపత్రి అభివృద్ధికి సుమారు రూ.11.22 కోట్లు  సీఎం వైయస్‌ జగన్‌ కేటాయించారు. డాక్టర్లు, నర్సుల కొరతను కూడా మే నెలాఖరు నాటికి భర్తీ చేపడుతాం. మెడాల్‌పై పరిశీలన చేస్తాం.

Back to Top