స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవ రెడ్డి 

ప‌ల్నాడు జిల్లా: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పార్టీ స‌త్తెన‌ప‌ల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవ రెడ్డి పిలుపునిచ్చారు. నకరికల్లు వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మండల కన్వీనర్‌ భవనం రాఘవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ గజ్జల మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో నాయకులు సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి భవిష్యత్తులో సముచిత గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేసే కుట్రలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ మోసాలను ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు.

గ్రామాల్లో కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. అనంతరం పార్టీ నాయకులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేడం ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి, మేడికొండ మస్తాన్‌ రెడ్డి, భవనం రవీంద్రారెడ్డి, పాలూరి రాజశేఖర్‌ రెడ్డి, గోపు అంజిరెడ్డి, కొవ్వూరి నర్సయ్య, షేక్‌ భాషా, షేక్‌ నన్నేసా, బైరెడ్డి పరమేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top