తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి అంటేనే కాంతి-వెలుగు, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి.. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ అని ముఖ్యమంత్రి అన్నారు. దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు.