దేవినేని అవినాష్‌ వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

తాడేపల్లి: చంద్రబాబు విధానాలు నచ్చక పలువురు కీలక నేతలు టీడీపీని వీడుతున్నారు. తాజాగా టీడీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ఆ పార్టీని వీడి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో దేవినేని అవినాష్‌ వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఆయనతో పాటు టీడీపీ సీనియర్‌ నేత కడియాల బుచ్చిబాబు, తదితరులు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ..రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, నవరత్నాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.సీఎం వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితుడనై పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ అడుగు జాడల్లోనే నడుస్తానని స్పష్టం చేశారు. టీడీపీలో మా వర్గం నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఎన్నిసార్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చెప్పారు.

 

Read Also: డేరాబాబాకు చంద్రబాబుకు తేడా లేదు

Back to Top