ఆల్ ఇండియా ర్యాంక‌ర్‌కు అభినంద‌న‌లు

క‌ర్నూలు: కర్నూల్ చాణక్యపురి కాలనీలోని మదర్ థెరిస్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంట‌ర్‌లో చదువుకొని ఎన్ఐపీఈఆర్‌(NIPER) ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థిని ప‌ద్మావ‌తిని ఎంపీ సంజీవ్‌కుమార్‌, ఎమ్మెల్యే శ్రీ‌దేవి అభినందించారు.  పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం బోగోలు గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి వెంకటేశ్వరమ్మ గార్ల కూతురు పద్మావతి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించ‌డంతో శ‌నివారం అభినంద‌న స‌భ ఏర్పాటు చేశారు. కార్య‌క్ర‌మంలో కర్నూలు నగర మేయర్ బివై రామయ్య,  మదర్ థెరిస్సా విద్యా సంస్థల అధినేత సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top