విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ ఆపాలి

శాస‌న మండ‌లిలో వైయ‌స్ఆర్‌సీపీ స‌భ్యుల ఆందోళ‌న‌

అమ‌రావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ ఆపాల‌ని శాస‌న మండ‌లిలో వైయ‌స్ఆర్‌సీపీ స‌భ్యుల ఆందోళ‌న‌కు దిగారు. ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా మండ‌లిలో తీర్మానం చేయాలని ప్ర‌తిప‌క్ష స‌భ్యులు డిమాండు చేశారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో ఎందుకు విలీనం చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీక‌ర‌ణపై వైయ‌స్ఆర్‌సీపీ స‌భ్యులు మండ‌లిలో ప్ర‌శ్నించారు. ప్రైవేటీక‌ర‌ణ దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయ‌ని ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి అనుమానం వ్య‌క్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది త‌మ ప్రాణత్యాగాలు చేశార‌ని గుర్తు చేశారు. మండ‌లిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై ప్ర‌శ్నిస్తే లేద‌ని మంత్రి స‌మాధానం చెబుతున్నారు. రూ.1500 కోట్ల నిధుల కోసం కేంద్రానికి ప్ర‌తిపాద‌న‌లు చేశారా అని నిల‌దీశారు. భ‌ద్రావ‌తి స్టీల్ ప్లాంట్‌కు రూ.30 వేల కోట్లు ఇచ్చార‌ని వ‌రుదు క‌ళ్యాణి చెప్పారు. 

Back to Top