రేపు కలెక్టరేట్ వద్ద భారీ ర్యాలీకి త‌ర‌లిరండి

వైయ‌స్ఆర్‌సీపీ శ్రీ‌కాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపు

శ్రీకాకుళం :ఆర్నెల్ల కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిన రైతులకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ గురువారం నిర్వహిస్తున్న అన్నదాతకు అండగా రైతు ఉద్యమాన్ని విజయవంతం చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు.  కలెక్టర్ కార్యాలయ దరి మహాత్మ జ్యోతిరావు పూలే పార్క్ వద్దకు గురువారం ఉదయం 10 గంటలకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకోవాలని, అక్కడ సమావేశం అనంతరం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేటకు చెందిన పార్టీ శ్రేణులు, అన్నదాతలు ఉదయం 9 గంటల నాటికి మడపం టోల్ ప్లాజా వద్దకు చేరుకోవాలని అక్కడి నుంచి అంతా కలిసి పూలే పార్కు వద్దకు చేరుకోవాలని చెప్పారు. ఎచ్చెర్ల, ఆముదాలవలస,  శ్రీకాకుళం నియోజకవర్గాల నుంచి నేరుగా పూలే పార్కు చేరుకుంటారని అన్నారు. ఆరు నెలల తర్వాత తొలిసారి వైయ‌స్ఆర్‌సీపీ తలపెట్టిన ఈ ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన వ్యక్తం చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారని కృష్ణదాస్ చెప్పారు. 

Back to Top