తాడేప‌ల్లిగూడెంలో కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమం 

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా: తాడేపల్లిగూడెంలో వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త వ‌డ్డీ ర‌ఘురాం ఆధ్వర్యంలో నిర్వహించిన “కాఫీ విత్ క్యాడర్” కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1వ వార్డు ఇంచార్జి కొర్రపాటి వెంకటేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి పార్టీ తాడేపల్లిగూడెం ఇంచార్జ్ వడ్డే రఘురాం హాజరై కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకత్వం–కార్యకర్తల మధ్య సమన్వయం మరింత పెరగాలని, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మనుకొండ శ్రీను, యల్లా దిలీప్, గొల్ల మనిరాజ్, బోగడపాటి సతీష్ తదితర నాయకులు, వార్డు ఇన్చార్జులు, పట్టణ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగుతూ, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
 

Back to Top