16న విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పర్యటన 

తాడేప‌ల్లి: సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి ఈనెల 16వ తేదీన విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. విశాఖ‌ మధురవాడ ఐటీ హిల్‌ నంబర్‌ 2 వద్ద ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హెలిప్యాడ్‌ వద్ద జీవీఎంసీ బీచ్‌ క్లీనింగ్ మెషీన్ల‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా పరవాడ చేరుకుని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో యుజియా స్టెరైల్‌ ప్రెవేట్‌ లిమిటెడ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంత‌రం అచ్యుతాపురం ఏపీసెజ్‌కు చేరుకుని లారస్‌ ల్యాబ్స్‌ యూనిట్‌ 2 ఫార్ములేషన్‌ బ్లాక్‌ ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

Back to Top