కర్ఫ్యూపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

ఈనెలాఖ‌రు వ‌ర‌కు పొడిగించాల‌ని ఆదేశం

సత్ఫలితాలు రావాలంటే కనీసం 4 వారాలు కర్ఫ్యూ అమలులో ఉండాలి

గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలి

ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: కరోనా కట్టడి చర్యలో భాగంగా గత రెండు వారాలుగా అమలు చేస్తున్న కర్ఫ్యూను ఈనెలాఖరు వరకూ పొడిగిస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా తగ్గుముఖం పట్టి సత్ఫలితాలు రావాలంటే కనీసం 4 వారాలు కర్ఫ్యూ అమలులో ఉండాలన్నారు. ఎప్పటిలాగే ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు వ్యాపార కార్యకలాపాలకు అనుమతిస్తూ.. 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. కరోనా నివారణ చర్యలు, వ్యాక్సినేషన్, ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు చనిపోయి ఒంటరైన పిల్లలను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆశావర్కర్లు, వలంటీర్లు, సచివాలయ వ్యవస్థను వినియోగించుకోవాలన్నారు. అదే విధంగా ఆస్పత్రుల్లో బెడ్స్‌ కావాలని 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసిన వారికి వెంటనే బెడ్స్‌ అందుబాటులోకి తెచ్చే విధంగా మరింత సమర్థవంతంగా అధికారులు వ్యవహరించాలని ఆదేశాలిచ్చారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top