రాజ‌మండ్రి బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: పింఛ‌న్ వారోత్స‌వాల్లో పాల్గొనేందుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాజ‌మండ్రి ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. మ‌రికొద్దిసేప‌ట్లో రాజమండ్రి మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడిన అనంతరం ఆర్ట్స్ కాలేజ్‌కు బయలుదేరుతారు. మున్సిపల్ గ్రౌండ్ నుంచి సాయి కృష్ణ థియేటర్, బీఈడీ కళాశాల, అప్సర థియేటర్, ఆజాద్ చౌక్, నందం గనిరాజు జంక్షన్, వై జంక్షన్ ల మీదుగా ఆర్ట్స్ కాలేజీకు చేరుకుని.. బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొంటారు. బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు. వైయ‌స్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి.. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,750 పెన్షన్‌ పెంపుతో లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. 

Back to Top