4న పశ్చిమగోదావరిలో సీఎం వైయస్‌ జగన్‌ పర్యటన

తాడేపల్లి: ఈనెల 4వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పర్యటించనున్నారు. ఏలూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. అదే విధంగా ఏలూరు కార్పొరేషన్‌ మాజీ మేయర్‌ నూర్జహాన్‌ కుమార్తె వివాహ వేడుకకు సీఎం హాజరుకానున్నారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో పటిష్ట భద్రతా చర్యలపై ఉన్నతాధికారులు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సమీక్ష చేపట్టారు. తమ్మిలేరు వరద ముంపు నుంచి ఏలూరు నగర ప్రజలకు శాశ్వత పరిష్కారం లభించేలా తమ్మిలేరు వెంబడి రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి తంగెళ్లమూడి వద్ద సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన చెప్పారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top