ప్ర‌తి అడుగులోనూ నాన్నే నాకు స్ఫూర్తి

మ‌హానేత వైయ‌స్ఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

తాడేప‌ల్లి: దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌యుడు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళుల‌ర్పించారు. వైయ‌స్ఆర్ జ్ఞాప‌కాలు, ఆశ‌యాల‌ను త‌ల‌చుకుంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ``నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది`` అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top