కేంద్ర‌మంత్రి భూపేంద్ర‌తో ముగిసిన సీఎం భేటీ

న్యూఢిల్లీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో స‌మావేశం ముగిసిన‌ అనంత‌రం కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద్ర యాద‌వ్‌తో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ స‌మావేశం సాగింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో త‌ల‌పెట్టిన ప్రాజెక్టుల‌కు సంబంధించి ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అనుమ‌తులు రావాల్సిన ప్రాజెక్టు వివ‌రాల‌ను కేంద్ర‌మంత్రికి వివ‌రించారు. రాత్రి 10 గంట‌ల‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ కానున్నారు. 

Back to Top