ఈనెల 16న గ‌ణ‌ప‌వ‌రంలో సీఎం ప‌ర్య‌ట‌న‌

పశ్చిమగోదావరి: ఈనెల 16వ తేదీన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా గణపవరంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప‌ర్య‌టించ‌నున్నారు. రైతుభరోసా పథకం కింద రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు ముఖ్య‌మంత్రి కార్యక్రమాల కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ గణపవరం చేరుకున్నారు. సభాస్థలి, హెలీప్యాడ్, ముఖ్యమంత్రి ప్రయాణించే రోడ్డు మార్గాలని వారు పరిశీలించ‌నున్నారు. 

తాజా వీడియోలు

Back to Top