న‌ర్సీప‌ట్నం బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌­మోహన్‌­రెడ్డి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. ఈరోజు ఉద‌యం తాడేపల్లిలోని త‌న‌ నివాసం నుంచి బయల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మ‌రికాసేప‌ట్లో నర్సీపట్నం మండలం బలి­ఘట్టం చేరు­కుంటారు. అనంత‌రం జోగు­నాథునిపాలెం వద్ద నర్సీపట్నం ప్రభుత్వ వైద్య కళా­శాల నిర్మాణానికి శంకుస్థాపన, తాండవ–ఏలేరు ఎత్తి­పో­తల పథ­కం కాలువల అనుసంధాన ప్రాజెక్టుకు శంకు­స్థాపన చేస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రసం­గిస్తారు. ఆ తర్వాత మ.1.25కు తిరుగు ప్రయాణమై తాడేపల్లి త‌న నివాసానికి చేరుకుంటారు.

Back to Top