తుపాన్ ప్ర‌భావిత జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో సీఎం వీడియో కాన్ఫ‌రెన్స్‌

తాడేప‌ల్లి: తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న సమీక్ష ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతున్నారు. తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌హాయ‌క‌ చ‌ర్య‌లు, పంట న‌ష్టం త‌దిత‌ర అంశాల‌పై సీఎం ఆరా తీస్తున్నారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి హోం, విపత్తు నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్‌ డాక్టర్ కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖ స్పెషల్‌ సీఎస్ జి. సాయి ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్ వై. శ్రీలక్ష్మి, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్ కె. విజయానంద్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌. అరుణ్‌ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఏ.సూర్యకుమారి, ఏపీ స్టేట్‌ సివిల్ సప్ల‌యిస్‌ కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీ జి. వీరపాండియన్,  గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సెక్రటరీ బి. మహమ్మద్‌ దీవాన్, విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్‌ డాక్టర్ బీ.ఆర్‌.అంబేద్కర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజర‌య్యారు. 

తాజా వీడియోలు

Back to Top