ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఐదోసారి నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎం వైయస్‌ జగన్‌తో పాటు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పాల్గొన్నారు. కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ అమలు, వలస కూలీల తరలింపు తదితర అంశాలపై సీఎం వైయస్‌ జగన్‌ ప్రధానికి వివరించనున్నారు. 
 

Back to Top