కన్యాశుల్కం కాపీలను ఆవిష్కరించిన సీఎం వైయ‌స్‌ జగన్‌

అసెంబ్లీ: శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. మహాకవి గురజాడ అప్పారావు 160 వ జయంతి సందర్భంగా ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం పుస్తకం ఐదు వేల కాపీల‌ను భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ముద్రించారు. కన్యాశుల్కం కాపీలను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆవిష్క‌రించారు. విజయనగరంలో గురజాడ ఇంటికి కాపీలను బహూకరించి సందర్శకులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి వివ‌రించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌) జీవీడీ కృష్ణమోహన్, చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top